అల్లూరిజిల్లా అరకులోయ , నవంబర్ 12, (త్రినేత్రం న్యూస్) : నిత్యమూ రద్దీగా ఉండే చోంపి,బస్కి మార్గం మధ్యలో రహదారి దారుణ స్థితికి చేరింది. చోంపి నుండి గత్తును గూడా వరకు మార్గమంతా గుంతలతో నిండిపోయి ఉండటంతో వాహనదారులు, పాదచారులు, ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు మార్లు ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన రాకపోవడంతో సమర్ధి రామచందర్ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. తమ సొంత డబ్బులు ఎత్తుకొని చోంపి నుండి గత్తును గూడ వరకు రోడ్డు గుంటలను పూడ్చి మరమ్మతు పనులు చేపట్టారు.
ప్రజా ప్రయోజనం కోసం ప్రజా నాయకులు, అధికారులు పట్టించుకోకపోయినా, స్థానిక ఆటోడ్రైవర్లు చూపిన ఈ సేవా తపన ప్రశంసనీయమని స్థానికులు ఆటో డ్రైవర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు రాజు, విన రాజు, యోబు, బంగారు రాజు, రాంబాబు, సాయికుమార్, రఘు, దోన్ను్, దాసు, అప్పలస్వామి, శిబో, గోపాలు, సత్య రావు,పూయూ సహా పలువురు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


