చంద్రబాబు, పవన్ లకు కృతజ్ఞతలు…
త్రినేత్రం న్యూస్, మండపేట:- మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో విలీనం పట్ల రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేస్తూ క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
ఈ అంశంలో ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన దేనిని లెక్కచేయకుండా అన్ని తానై సారధ్యం వహించిన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, కృషి ఎంతో ఉందని లీలాకృష్ణ, కొనియాడారు.
మండపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంచను నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,కి, మంత్రి నారా లోకేష్ ,కి, సబ్ కమిటీ సభ్యులైన మంత్రులకు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ,కి, అధికారులు అందరికీ జనసేన పార్టీ తరుపున వేగుళ్ళ లీలాకృష్ణ , తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.
మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో వీలినం చేసినందుకు నియోజకవర్గ ప్రజలు అందరూ ఋణపడి ఉంటారని ఆయన పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


