త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణం 18వ వార్డులో మున్సిపల్ సాధారణ నిధులు 27లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సి.సి రోడ్డు పనులను మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో భాగంగా సి.సి రోడ్డు నిర్మిస్తున్నామన్నారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన రోడ్డు పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైస్సార్సీపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రగుంట అయ్యప్ప, మున్సిపల్ డి.ఈ కె.శ్రీనివాసు, ఏ.ఈ డి.పవన్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


