తూర్పు గోదావరి జిల్లా అడ్మిన్ అదనపు ఎస్పీ ఎన్.బి.ఎం. మురళీకృష్ణ బదిలీ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది కాలంగా ఆయన అడ్మిన్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్నా.. ఇతర విభాగాల్లో కూడా హవా కొనసాగించారని ఆరోపణలు ఉన్నాయి.
ముఖ్యంగా పలు కేసుల్లో ఆయన ప్రత్యక్ష పాత్ర పోషించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒక కేసు విషయంలో ఎస్పీ లేనప్పుడు ఆయనే స్వయంగా కేసు నమోదు చేయించారని, ఆధారాలు ఉన్నా సరే అదే కేసులో మరో వర్గం ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కాకుండా అడ్డుకున్నారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇలా ఆరోపణల నేపథ్యంలోనే ఆయన్ను బదిలీ చేసినట్లు పలువురు అంటున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


