MLA Vegulla : బిసి బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట పట్టణంలో ఉన్న ప్రభుత్వ బిసి బాలికల మరియు కళాశాల బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా ఆయన హాస్టల్ గదులు, బాత్ రూమ్, కిచెన్ లను పరిశీలించారు. అనంతరం అక్కడి విద్యార్థులతో మాట్లాడి, భోజనం, వసతి, పరిశుభ్రత పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాత్ రూమ్ లను ఎప్పటి కప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, బక్కెట్లు, మగ్గులు ఏర్పాటు చెయ్యాలని వార్డెన్ ను ఆదేశించారు. వసతి గృహంలో నెలకొన్న సమస్యలను హాస్టల్ వార్డెన్ ను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్.డబ్యూ.ఒ సౌజన్య, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla conducts surprise inspection

You cannot copy content of this page

Scroll to Top