తేదీ : 23/12/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, ప్రజల భద్రత లక్ష్యంగా శాంతి భద్రతల పరి రక్షనే ధ్యేయంగా పోలీసులు చేపడుతున్న నిరంతర సేవలు ప్రజల మనసులను గెలుసుకున్నాయి. విధి నిర్వహణలో ఎండా, వాన తేడా లేకుండా కాలానికి అతీతంగా పనిచేస్తూ , ప్రజల ప్రాణాలను కాపాడడమే పోలీసులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. వాళ్ల కృషి ప్రశంసనీయమని చెప్పవచ్చు.
ముఖ్యంగా పట్టణాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తీసుకుంటున్న ముందస్తు చర్యలు మరువలేనివి అని ప్రజలు చెబుతున్నారు. అదేవిధంగా ప్రధాన కూడళ్ళ వద్ద డ్రమ్ములను ఏర్పాటు చేసి వాటిని విసుగుతో నింపి, వాహనాల వేగాన్ని తగ్గించేలా ఏర్పాట్లు చేశారు. దూర దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి.
ఈ చర్యల వల్ల ప్రమాదాల తీవ్రత గణనీయంగా ఉందని స్థానికులు తెలిపారు. రోజు వారి ట్రాఫిక్ నియంత్రణ ప్రమాదకర ప్రాంతాల్లో పర్యవేక్షణ ప్రజలకు అవగాహన కల్పించడం, వంటి కార్యక్రమాలతో ప్రజల మధ్య నమ్మకాన్ని మరింత బలపరుస్తున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ప్రమాదం జరగకుండా చూడడమే అసలైన సేవ అని ప్రజలకు తెలియజేస్తున్నారు పోలీసులు. ప్రజల రక్షణలో ముందుండే ఈ పోలీస్ సేవలు నిజంగా ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


