YCP : మండపేట మండలం మారేడుబాక గ్రామ వైసిపి పార్టీ కమిటీ నియామకం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్.. మండపేట మండలం మారేడుబాక గ్రామ వైసిపి పార్టీ కమిటీ నియామకం జరిగింది. మారేడుబాక గ్రామ పార్టీ అధ్యక్షులుగా మట్టపర్తి గోవిందరాజు రెండోవసారి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ రెండోవసారి ఎంపికైన గోవిందరాజుకు అభినందనలు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు మీకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని పూర్వవైభవాన్ని పార్టీకి మీ గ్రామంలో తీసుకురావాలని తెలియజేశారు. గోవిందరాజు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును దుస్సాలువతో సత్కరించి రెండోవసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా గోవిందరాజు మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ శక్తివంచన లేకుండా పార్టీకి కార్యకర్తలకి అనుసంధాన కర్తగా ఉంటానని తోటకి మాటిచ్చారు. మండపేట మండల కన్వీనర్ అడబాల బాబ్జి ఆధ్వర్యంలో ఉపాధ్యక్షులుగా గండి నరేంద్రబాబు, మంజులూరి దుర్గాదేవి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ కమిటి విభాగాల గ్రామ కమిటీ ప్రతులను త్రిమూర్తులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఐటి విభాగం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు, చొల్లంగి రాజశేఖర్, వాసంశెట్టి కామేశ్వరరావు, వాసంశెట్టి మణికంఠ, కొమ్మన భవాని శంకర్, సుంకర రాజు, కమిటి సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mandapet Mandal Maredubaka Village YCP Party Committee Appointment

You cannot copy content of this page

Scroll to Top