త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 22: నెల్లూరు జిల్లా: :కావలి పట్టణం గాయత్రి నగర్‌లోని నలంద హైస్కూల్‌లో సోమవారం నిర్వహించిన సైన్స్ ఫేర్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి , పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్ వర్క్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు తయారు చేసిన వివిధ శాస్త్రీయ నమూనాలు, పరిశోధనాత్మక ప్రాజెక్టులను శ్రద్ధగా పరిశీలించారు. ప్రతి ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఆలోచన, శాస్త్రీయ దృక్పథాన్ని తెలుసుకుంటూ విద్యార్థులను అభినందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి సైన్స్ ఫేర్ కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను, ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని అన్నారు. చిన్న వయస్సులోనే శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకుంటే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, పరిశోధకులుగా ఎదుగుతారని చెప్పారు.
అలాగే విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తమ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల పాత్ర విద్యార్థుల జీవితంలో కీలకమని, వారిని సరైన దిశలో నడిపిస్తే సమాజానికి మంచి పౌరులు తయారవుతారని పేర్కొన్నారు.కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి , పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


