ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైను పేదలకు తక్షణమే కేటాయించాలని ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
వరంగల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. గత ప్రభుత్వ హయాంలో తలపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి సదుపాయాలు కల్పించి తక్షణమే అర్హులైన పేదలకు కేటాయించాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు ఈరోజు ఎం సి పి ఐ యు ఆధ్వర్యంలో దూపకుంట, తిమ్మాపూర్, లక్ష్మి టౌన్షిప్ లలో పూర్తిచేసిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను తక్షణమే పేదలకు అందించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ శ్రీమతి సత్య శారద మెమోరాండం ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, నగర కార్యదర్శి మాలోత్ సాగర్ మాట్లాడుతూ పాలకులు పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆచరణలో విస్మరిస్తున్నారని పోరాడితే తప్ప ఇచ్చిన హామీలు అమలు కావటం లేదని ఈ క్రమంలో గత ప్రభుత్వం అన్ని వసతులతో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పి తగిన సమయంలో పూర్తి చేయకుండా వదిలివేశారని పూర్తి అయిన పంపిణీ చేయలేదని ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంచుతుందని ఆశపడితే అందుకు విరుద్ధంగా రెండు సంవత్సరాలు గడిచిన గత ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో రాజకీయ లబ్ధికి పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులు పూర్తి అయి ఉన్న గత ప్రభుత్వ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పంచకపోవడం పూర్తికాక అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేయించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వరంగల్ జిల్లాలో దూప కుంట, తిమ్మాపూర్, లక్ష్మీ టౌన్షిప్ ఏరియాల్లో ఉన్న రెండు పడకల గదులను త్వరితగతిన పూర్తి చేసి పేదలు నివాసం ఉండే విధంగా వసతులు కల్పించి అర్హులకు ఇవ్వాలని అట్టి ప్రాంతంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇస్తామన్న రెండు పడకల గదులను సైతం తక్షణమే కేటాయించాలని కోరారు.
ఇప్పటికే పూర్తి చేసి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంచకుండా తాత్సారం చేయడం అంటే పేదలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందని స్థానిక మంత్రి ఎమ్మెల్యే శ్రీమతి కొండా సురేఖ ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ దృష్టి పెట్టి పేదలకు నిలువ నీడ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ నగర సహాయ కార్యదర్శి సుంచు జగదీశ్వర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముక్కెర రామస్వామి ఏరియా కార్యదర్శులు గణిపాక ఓదెలు ఐతం నాగేష్ మహమ్మద్ మెహబూబ్ భాష పరిమళ గోవర్ధన్ రాజు నగర నాయకులు మాలి ప్రభాకర్ అప్పనపురి నరసయ్య యగ్గేని మల్లికార్జున్ తాటికాయల రత్నం బాబు చుక్క ప్రశాంత్ యాకయ్య యాదగిరి తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


