జూన్ 26, 2026
TRINETHRAM NEWS

ముఖ్య అతిథులుగా మంజుల శ్రీనివాస్ రెడ్డి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. గోదావరిఖనిలో కూరగాయల మార్కెట్ & ఫుడ్ పేస్ట్ ను శనివారం రోజున ముఖ్య అతిథులుగా గౌరవనీయులైన మంజుల శ్రీనివాస్ రెడ్డి పాఠశాల ఆవరణలో కూరగాయల మార్కెట్ & ఫుడ్ పేస్ట్ పై అవగాహన కల్పించుటకై అంగరంగ వైభవ వైభవంగా ప్రారంభించడం జరిగినది . ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని విద్యార్థులు వారి వారి ముచ్చటైన వేషాధారణలో సరసమైన ధరలకు కూరగాయలూ మరియు వివిధ రకాలైన వంటకాలను అమ్మడం జరిగినది.

చివరిసారిగా కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చిన్నారులతో నిర్వహించడం మా కృష్ణవేణి విద్యాసంస్థలకే సాధ్యం అని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పోషకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసినటువంటి కృష్ణవేణి విద్యాసంస్థల పాఠశాల ప్రధానోపాధ్యాయులను మరియు ఉపాధ్యాయ బృందం ను అభినందించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Vegetable Market & Food Fest Awareness

You cannot copy content of this page