MLA Vegulla : అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే వేగుళ్ళ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్, మండపేట… గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లను నిర్లక్ష్యం చేసి అధ్వాన్నంగా మారిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పులను సరి చేస్తోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అన్నారు. సోమవారం మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో దేవుడు కాలనీలో రూ.60 లక్షలు ఎన్.ఆర్.ఈ.జి.యస్ నిధులు మంజూరు అయిన సంధర్భంగా సదరు రోడ్లన్నీ పరిశీలించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మురికి నీరు వెళ్ళే అవకాశం లేకుండా డ్రైన్ లు నిర్మించకుండా, సి.సి.రోడ్లు వేసినారని దాని వల్లన అనేక ఇబ్బందులు పడుతున్నామని అక్కడి ప్రజలు ఎమ్మెల్యే వేగుళ్ళ తో చెప్పడంతో సదరు రోడ్లన్నీ పరిశీలించి సమస్యలను నివారించడానికి ఎమ్మెల్యే వేగుళ్ళ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, గ్రామ నాయకులు, కార్యకర్తలు, పంచాయితీ రాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు, తదితర్లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA Vegulla, who is driving development

You cannot copy content of this page

Scroll to Top