Rangaraya Medical College : సమాన పనికి సమాన వేతనంకై పోరాడుదాం

TRINETHRAM NEWS

రంగరాయ మెడికల్ కాలేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ద్వితీయ మహాసభ…

త్రినేత్రం న్యూస్ : డిసెంబర్,15: కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ ఔట్సోర్సింగ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ద్వితీయ మహాసభ స్థానిక సాంబమూర్తి నగర్, రెవెన్యూ కాలనీ రోడ్ దుర్గమ్మ గుడి పక్కన పి.ఆర్ భవన్లో సోమవారం సాయంత్రం వనమాడి కాటవేణి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జి జి హెచ్), వైద్య విధాన, ఏరియా, పి హెచ్ సి, సిహెచ్ సి, మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎందులో పని చేసిన పని విధానం ఒకటేనని, సమయం ఒకటేనని, కార్మికుల శ్రమను దోచుకోకుండా శ్రమకు తగ్గిన ప్రతిఫలం మంజూరు చేయాలని ఆయన అన్నారు.

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో శానిటేషన్ కార్మికులకు 13960 రూపాయలు మంజూరు చేస్తూ, చేతికి 800 రూపాయలు అందజేస్తున్నారని, అదేవిధంగా అన్ని చోట్ల వేతనాలు అమలు చేయాలని కార్మికుల్లో విభేదాలు చూపించొద్దని ఆయన అన్నారు. ప్రభుత్వ అధికారులు, వైద్యశాఖ అధికారులు, మంత్రులు సమక్షంలో జరిగిన ఒప్పందం ప్రకారంగా 138 వ జీవో ప్రకారంగా శానిటేషన్, సెక్యూరిటీ, పేస్ట్ కంట్రోల్ కార్మికులకు 18600 రూపాయలు మంజూరు చేయాలని, దీనిలో కమిషన్లు పోగా 16 వేల రూపాయలు మంజూరు చేయగా అందులో ఈపీఎఫ్ ,ఈఎస్ఐ వర్కర్ ఖాతా నుండి మినహాయించుగా 14 వేల రూపాయలు జీతాలు మంజూరు చేయాలని, కానీ జీవో ప్రకారం గా జిజిహెచ్ లో తప్ప ఎక్కడ అమలు చేయడం లేదని జిల్లా వ్యాప్తంగా ఒకే విధంగా సమాన పనికి సమాన వేతనాలు మంజూరు చేయాలని ప్రసాద్ అన్నారు.

రంగరాయ మెడికల్ కాలేజ్ లో అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘంగా 20 21 లో ఏర్పాటు చేశామని ఇది రెండవ ద్వితీయ మహాసభ ని ఆయన అన్నారు. శానిటేషన్ కార్మికులకు ఏ కష్టం వచ్చినా, జీతాలు సక్రమంగా అమలు, పి ఎఫ్ ఈఎస్ఐ సక్రమంగా చెల్లించ లేకపోయినా ఏఐటీయూసీ వారికి అండగా ఉంటూ కార్మికుల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతుందని ప్రసాద్ అన్నారు. బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ రంగరాయ మెడికల్ కాలేజ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ కి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని, ఏ సమస్యలు వాటి పరిష్కారానికి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి బాలకృష్ణ, కాటవేని, శివకుమార్, మోహన్, రామలక్ష్మి, సత్య, ఆంటోనీ రామారావు తదితర సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Let's fight for equal pay for equal work

You cannot copy content of this page

Scroll to Top