Potti Sriramulu : అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ డిసెంబర్ 16, (త్రినేత్రం న్యూస్): అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం అల్లూరిజిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధనకై 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితంగానే నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని తెలిపారు. అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్ బర్దార్, ఇంచార్జి డీఆర్ఓ అంబేద్కర్, ఇంచార్జి ఆర్డీవో, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్ లోకేశ్వరరావు, కలెక్టరేట్ ఏఓ ప్రసాద్ రావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

A grand tribute to the immortal Potti Sriramulu

You cannot copy content of this page

Scroll to Top