Crime News : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త హత్య.. భార్య–ప్రియుడు అరెస్ట్

TRINETHRAM NEWS

Trinethram News : వికారాబాద్ జిల్లా చోడాపూర్ మండల కేంద్రంలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కర్రె రత్నయ్య (32) తన భార్య కవిత, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడితో కలిసి నివసిస్తూ వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కవిత ప్రైవేట్ కంపెనీలో కూలీగా పని చేస్తోంది.

ఈ క్రమంలోనే కవితకు అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో వివాహేతర సంబంధం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న రత్నయ్య, పెళ్లీడుకొచ్చిన కూతుర్లు ఉన్నారని, కుటుంబ గౌరవాన్ని కాపాడాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఈ హెచ్చరికలే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా మారుతున్నాయని భావించిన కవిత, ప్రియుడు రామకృష్ణతో కలిసి భర్తను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది.

ప్లాన్ ప్రకారం, రత్నయ్య ఎప్పటిలాగే పొలం పనుల కోసం వెళ్తుండగా వెనుక నుంచి ట్రాక్టర్‌తో ఢీకొట్టి రామకృష్ణ అతడిని హతమార్చాడు. అనంతరం ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు కవిత పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చింది.

అయితే రత్నయ్య తమ్ముడు దేవయ్య అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కీలక మలుపు తిరిగింది. పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా, కవిత తన ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర పన్నినట్లు అంగీకరించింది. దీంతో భార్య కవితతో పాటు ప్రియుడు రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదంతో పాటు కలకలం రేపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Husband murdered for obstructing extramarital affair

You cannot copy content of this page

Scroll to Top