Trinethram News : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉత్కంఠభరిత ఫలితం వెలువడింది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన ముత్యాల శ్రీవేద కేవలం ఒక్క ఓటు తేడాతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల్లో శ్రీవేద పోటీ చేస్తున్న విషయం తెలిసిన వెంటనే ఆమె మామ ముత్యాల ఇంద్రకరణ్ రెడ్డి అమెరికా నుంచి నాలుగు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించారు. ఆ ఒక్క ఓటే చివరికి ఫలితాన్ని మార్చిందని గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
వోట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
మొత్తం ఓట్లు: 426
పోలైన ఓట్లు: 378
ముత్యాల శ్రీవేద: 189 ఓట్లు
హర్షస్వాతి: 188 ఓట్లు
చెల్లని ఓట్లు: 1
కేవలం ఒక్క ఓటు తేడాతో వచ్చిన ఈ విజయం ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువ ఎంత ముఖ్యమో చాటిచెప్పింది. గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటుతుండగా, ఓటు హక్కు ప్రాధాన్యతపై ఈ ఘటన అందరికీ గుర్తుండిపోయే ఉదాహరణగా నిలిచింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


