Venkatesh’s Birthday Celebrations : ఘనంగా విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

TRINETHRAM NEWS

పేదలకు చీరలు,రగ్గులు పంపిణీ

త్రినేత్రం న్యూస్, రాజమహేద్రవరం, డిసెంబర్ 13:విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా శనివారం శ్యామలా థియేటర్లో ఘనంగా నిర్వహించారు.విక్టరీ వెంకటేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు, బి.వి.హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్య అతిధులుగా‌హాజరైన మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్, స్థానిక 21 వ వార్డు టీడీపీ ఇన్చార్జి,రాజమండ్రి నగర టీఎన్టీయూసి అధ్యక్షుడు నల్లం శ్రీను,సురేష్ మూవీస్ మేనేజర్ జె.లక్ష్మణ్ రావు, సురేష్ మూవీస్ అసిస్టెంట్ మేనేజర్.సత్యరంగయ్య, శ్యామలా థియేటర్ మేనేజర్ పి.చిట్టిబాబు చేతుల మీదుగా కేక్ కట్, చేయించారు.అనంతరం పేదలకు చీరలు, రగ్గులు పంపిణీ చేశారు.

అలాగే శ్యామలా థియేటర్ స్టాఫ్ కు స్వీటు బాక్సులు, పండ్లు అందచేశారు.విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రాలు,కలెక్షన్ల వివరాలతో అభిమానులు ముద్రించిన పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా బట్లంకి ప్రకాష్ మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ బాబు, అభిమానులు చాలా మంచివారని,వారు వివాదాలకు దూరంగా ఉండి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని కొనియాడారు.వెంకటేష్ కుటుంబ చిత్రాల హీరో అని,ఆయన సినిమాలు‌ అందరికీ నచ్చుతాయని అందుకనే ఘన విజయం సాధిస్తాయని పేర్కొన్నారు.తమ అభిమాన హీరో ఆలోచనలకు అనుగుణం ఆయన ఫ్యాన్స్ కూడా ఒక పద్దతిగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తుంటారని అభినందించారు.హీరో వెంకటేష్ బాబు పుట్టిన రోజు వేడుకలకు తమను ఆహ్వానించడం సంతోషమని బట్లంకి ప్రకాష్ చెప్పారు.పుట్టినరోజు వేడుకల్లో ఫ్యాన్స్ కె.జగదీష్ (చెర్రీ),ఎన్..కొండబాబు,పి.
రఘు,టి.లక్ష్మీరాజ్,ఎం.దేవీ శివప్రసాద్,రామ్ కుమార్,పి.రాము,అంకు ప్రసాద్,పల్సర్ ప్రసాద్,రాయుడు పవన్,పోసిన పండు,ఆటో రాజు, నాగు పాత్రో, రాజు,పాపారావు రాజగోపాల్,టి.గణపతి,ఎనరాము,కోర్లయ్య తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Victory Venkatesh's birthday celebrations in grand style

You cannot copy content of this page

Scroll to Top