త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 11, రాజమహేంద్రవరం; డిసెంబర్.11.. రాజమండ్రి నగర పాలక సంస్థ శానిటేషన్ విభాగంలో, ఆప్కాస్ కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు మంజూరు కాలేదని, ఈ పండగ సమయంలో, జీతాలు మంజూరు, కాకపోతే కార్మికులు ఆర్థిక మానసిక ఆవేదన చెందుతున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులను కలిసి కార్మికులకు జీతాలు వెంటనే మంజూరు చేయాలని వారు వినతి పత్రం అందజేశారు
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆనాడు సమ్మె కాలంలో ప్రతి పండక్కి బోనస్ ఇస్తామని చెప్పారని గత రెండు సంవత్సరాలుగా బోనస్ మంజూరు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు బ్యాంకు ఖాతాలు మారుస్తే జీతాలు పడవని మేమందరం చెప్పిన వినలేదని ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ కు మారడం వల్ల జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అధికారులను కలిసిన వారిలో మున్సిపల్ వర్కర్స్ జిల్లా అధ్యక్షులు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు తెనాలి దుర్గమ్మ ఆఫీస్ బేరర్స్ కాకి శారద. బంగారు గిరి.గూడపు గిరి పోలమ్మ.బాలు.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


