Bogolu Tank Dam Destroyed : బోగోలు చెరువు కలుజు ధ్వంసం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 11: నెల్లూరు జిల్లా: బోగోలు మండలం. బోగోలు సాగునీటి చెరువు దక్షిణ కలుజు ధ్వంసం ఆక్రమణదారుల పనేనని, తక్షణం వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, నీరు వృధా కాకుండా తక్షణ మరమ్మత్తులు చేపట్టాలని బోగోలు చెరువు సాగునీటి సంఘం సభ్యులు, రైతులు ఇరిగేషన్ ఏ.ఈ ,జితేంద్ర రెడ్డికి ఫిర్యాదు చేశారు.
విషయం తెలుసుకున్న ఏ.ఈ. చెరువు కలుజును మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు తో కలిసి పరిశీలించాడు. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపడుతామని, వేసవిలో నీళ్లు తగ్గిన తరువాత శాశ్వత మరమ్మతులు చేస్తామన్నారు.
అయితే బోగోలు చెరువు లోతట్టు ప్రాంతాలలో అక్రమంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కొందరు వ్యక్తులే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారని రైతులు ఆరోపిస్తున్నారు. పై కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ పలువురు రైతులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bogolu tank dam destroyed

You cannot copy content of this page

Scroll to Top