Distribution of Essential Commodities : నిత్యవసర సరుకుల పంపిణీ

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు ఉదయం 11:30 నిమిషాలలో ఇరగదిండ్ల శేఖర్ కి అధ్యక్షుడు ఎన్ వి టి సభ్యులతో కలిసి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేఖర్ అనే వ్యక్తి రాళ్లు కొట్టుకొని జీవనోపాధి గడుపుతున్నాడు తాను రాయి కొడుతున్నప్పుడు అనుకోకుండా అతని కాలు పైన ఒక రాయిపడి 24 కుట్లు పడినవి కాలు విరిగినది అతనికి ఒక చిన్న బాబు నాలుగు నెలల వరకు తాను ఎలాంటి పని చేయలేని పరిస్థితి.

ఇట్టివిషయం తెలుసుకున్న దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సమాజసేవలో ఎప్పుడు ముందుంటుందని క్రీడాకారులకు కళాకారులకు ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, వైయస్ కరుణాకర్, తాళ్ల సురేష్, రాంబాబు, వెంకటేష్, రాజ్ కుమార్, చక్రపాణి,రమేష్, అంజి, మల్లేష్, రామస్వామి, అనిల్, రాజు, క్రీడాకారులు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Distribution of essential commodities

You cannot copy content of this page

Scroll to Top