Giramoni Srinivas : గ్రామ అభివృద్ధికి సేవలందించే భాగ్యం తనకు కల్పించండి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) డిసెంబర్ 11 త్రినేత్రం న్యూస్. డిండి (గుండ్లపల్లి) గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గిరమోని శ్రీనివాస్ గ్రామపంచాయతీ ఎన్నికల బరిలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు.
ఈ సందర్భంగా ఆయనప్రచారంలో భాగంగా మాట్లాడుతూ గ్రామం పై పూర్తిగా అవగాహన ఉన్న యువకుడిగా గ్రామపంచాయతీ వ్యవస్థపై అవగాహన కలిగిన వ్యక్తి గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చిన ముందుండి కొట్లాడే యువకుడి గా అందరికీ అందుబాటులో ఉంటూ నిరంతరం గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తూ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత తనదని ఆయన హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు అందరూ గ్రామపంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీలో ఒకడిగా నన్ను గుర్తించి మీ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గ్రామ ప్రజల ఆశీర్వాదమే తనకు కొండంత అండ అని గ్రామ ప్రజల సహాయ సహకారాలతో గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

May he be blessed with the opportunity to serve the development

You cannot copy content of this page

Scroll to Top