MLA KP. Vivekanand : వైకుంఠధామంలో చికెన్ డంపింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ లోని వైకుంఠధామంలో మౌలిక వసతుల కల్పనపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మున్సిపల్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా ఫర్ ఏ బెటర్ సొసైటీ సభ్యులు వైకుంఠధామంలో కనీస వసతులు కల్పించకుండా కొందరు వ్యక్తులు వైకుంఠధామం అభివృద్ధి కమిటీ పేరిట వైకుంఠధామాన్ని ఎటువంటి అభివృద్ధి చేయకపోగా, అక్రమ చికెన్ వేస్టేజ్ డంపింగ్ యార్డ్ గా వైకుంఠధామాన్ని మారుస్తున్నారని ఎమ్మెల్యే కి విన్నవించారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ… వైకుంఠ దామం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో గౌరవప్రదమైన చివరి మజిలీ అని అలాంటి వైకుంఠధామంలో మౌలిక వసతులకు తక్షణమే నిధులు కేటాయించి స్నానపు గదులు, నీటి సరఫరాతో పాటు బోర్ మోటార్ ను బిగించి పరిశుభ్రంగా ఉంచాలని, అదే విధంగా వైకుంఠధామం ప్రవేశ ద్వారం వద్ద శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. వైకుంఠధామం లో చికెన్ వేస్టేజ్ డంపింగ్ కు పాల్పడుతున్న వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వెంటనే వారిపై క్రిమినల్ కేసుల నమోదు చేయాలని కమిషనర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీ, నిజాంపేట్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్, డివిజన్ అధ్యక్షులు ఉప్పు జశ్వంత్, శ్రీకర్ గుప్తా, ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు అర్పితా ప్రకాష్, నాయకులు విజయ్ కుమార్, వై. ఎస్, రిషి, సాయికుమార్, నారాయణ గుప్తా, లలితా రెడ్డి, ఉప్పు శిల్ప, కాలనీవాసులు మోహన్ రెడ్డి, భరద్వాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Take strict action against those involved in chicken dumping in Vaikuntha Dham

You cannot copy content of this page

Scroll to Top