మేడా శ్రీనివాస్ , సందేహలు , రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
త్రినేత్రం న్యూస్, నక్షలైట్ హిడ్మా భారత జాతీయ జెండాను గౌరవిస్తునే సాయుద పోరాటంలో అమరులయ్యారు . ఓవైసీ పాకిస్తాన్ ఇస్లాం కు జై అంటూనే భారత జాతీయ గీతాన్ని అగౌరవ పరుస్తు భారత పార్లమెంట్ లో కీర్తింప బడుతున్నారు .. నక్షలైట్ ఉద్యమం స్వదేశీ , విదేశీ , దోపిడి పాలనకు , బానిసత్వానికి వ్యతిరేకంగా పురుడు పోసుకుంది . ఉగ్రవాదం విదేశీ మత ఉన్మాదంను ప్రోత్సహిస్తుంది . మన పాలకులు మాత్రం.. ఉగ్రవాద పాకిస్తాన్ తో శాంతి చర్చలు అంటారు . నక్షలైట్ లను తుపాకీతో కాల్చి చంపేస్తుంటారు .
ఆపరేషన్ సిందూర్ వంటి భారతదేశ భద్రతా దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని ఆపేసారు . మరి ఆపరేషన్ కగార్ ను ఎందుకు ఆపటం లేదు . ఎందుకు శాంతి చర్చలు జరుపటం లేదు . సామాన్య పౌరులను చంపుతున్న తీవ్రవాదులుతో చర్చలు జరుపుటకు ఆశక్తి చూపిస్తున్నారు . సమ న్యాయం అమలు చేయమని పోరాడుతున్న నక్షలైట్ లను చంపి వేయటంలో మర్మం ఏమిటో సగటు భారతీయులకు అర్ధం కావటం లేదు .
ఎంకౌంటర్ లపై నిజమెంత ! కేసుల స్పష్టతపై ఎంత మేరకు నిజం ఉంటుంది . భారతదేశానికి నక్షలైట్ లతో ప్రమాదమా ! తీవ్రవాదదులతో ప్రమాదమా ! స్పష్టత ఇవ్వగల వేదిక మన ప్రభుత్వ వ్యవస్థలో ఉందంటారా !
హక్కుల కోసం పోరాడే నక్షలైట్ లు అడవిలో వుంటున్నారు . జాతీయ గీతాన్ని గౌరవించం అంటున్నవారు పార్లమెంట్ సాక్షిగా భారత్ లో జిహాద్ ప్రకటిస్తాం అని ప్రకటించుకుంటున్న వారు భారతదేశ చట్ట సభల్లో గౌరవింప బడుతున్నారు .. తీవ్రవాదానికి అనుకూలంగా పార్లమెంట్ లో వాదిస్తున్న వారు ప్రజా ప్రతినిధులు అవుతున్నారు . హక్కులు కోసం మాట్లాడే నక్షలైట్ ప్రమాధికారి ఎలా అవుతారు ! ప్రశ్నినించే వారు ప్రజాస్వామ్యంలో ఉండకూడదా !
ముంబై తాజ్ హోటల్ లో మారణ కాండ సృష్టించిన కసబ్ ను చట్ట బద్దంగా విచారించి ఉరి తీసారు . భారతదేశ విమానాన్ని కాందహర్ విమానాశ్రయం వేదికగా హైజాక్ చేసిన మసూద్ అజార్ తో సహ కొంతమంది ముష్కరులను వారు కోరిన విధంగా అత్యంత గౌరవంగా పాకిస్తాన్ పంపించారు ..
కగార్ వంటి ఆపరేషన్స్ లేకుండా నక్షలైట్ లను చట్ట బద్దంగా నిర్భందించగల వ్యూహం . సామర్ధ్యత మన ప్రభుత్వాలకు లేదంటారా ! ఎంకౌంటర్స్ కారణంగా సాయుద పోరాటాన్ని ఆపగలుగుతున్నారా ! అనే అంశం పై ఎన్నడైనా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా ! లేదా !
హిడ్మా , తదితరులను చంపి సాయుద పోరాటంలో మెరుగైన మార్పులు సాధించ గలిగారా ! మరిన్ని అలజడులకు కారకులవుతున్నారా ! స్వదేశీ ఉద్యమకారులను ఎంకౌంటర్స్ చేయటం . విదేశీ ఉగ్రవాదులను చట్టభద్ధంగా శిక్షించటంలో జరుగుతున్న ప్రభుత్వ వైఖరిని పలువురు ప్రశ్నిస్తున్నారు .
భారత ప్రజాస్వామ్యం ఎటు పోతుంది . విప్లవాన్ని ఎంకౌంటర్ చేయటం . ఉగ్రవాదాన్ని చట్ట బద్దంగా శిక్షించటంలో అర్ధం ఏమిటి !మన రాజ్యాంగ భద్రత పట్ల సగటు భారతీయులు
ఖచ్చితమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు ..
గమనిక : సాయుద పోరాటం వద్దు . ఉగ్రవాదాన్ని తుద ముట్టిద్దాం
నక్షలైట్స్ తుపాకీని వదిలి రాజకీయ ప్రజా క్షేత్రం లోకి రావాలి ..
మేడా శ్రీనివాస్ , ఎమ్ఏ, ఎల్ ఎల్ ఎమ్, ఎమ్ఏ(జర్నలిజం) ఎమ్ఏ(ఎంజేఎంసీ),
అధ్యక్షులు ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ..
మొబైల్ : 9248777222 ..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


