జూన్ 26, 2026
TRINETHRAM NEWS

అంతిమయాత్రలో పాల్గొన్న దళిత సంఘాల నాయకులు
త్రినేత్రం న్యూస్, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం భూపాలపట్నంలో కాకర అప్పారావు అనే దళిత యువకుడ్ని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం అందరికీ తెలిసిందే అయితే దీనిపై గత మూడు రోజులుగా దళిత సంఘాల నాయకులు హత్య చేసిన వ్యక్తులను మరియు వెనకుండి నడిపించిన అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులను పూర్తిస్థాయిలో అరెస్టు చేయాలని, వారి కుటుంబానికి ప్రభుత్వం భరోసా కల్పించాలని పోరాటం చేస్తూ వచ్చారు ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత అధికారులు కొంతవరకు న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా వారి కుటుంబంలో ఒక ఉద్యోగం కూడా ఇస్తానని కలెక్టర్, హామీ ఇవ్వడం జరిగింది.

ఇప్పటికే సమయం లేట్ అవ్వడం వల్ల త్వరితగమన న అంతిమయాత్ర పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటుగా దళిత నాయకులు ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతాలు కొండబాబు దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోటి చంగల్ రావు దళిత ప్రజా చైతన్య అధ్యక్షులు బుంగ సతీష్ మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి లింగం శివ జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏనుగుపల్లి కృష్ణ బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం దళిత బహుజన ఫ్రెంట జిల్లా నాయకులు అన్నవరం వివిధ దళిత సంఘాలకు సంబంధించిన రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kakara Apparao, who was brutally murdered

You cannot copy content of this page