అరకులోయ డిసెంబర్ 10, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లాలో కాఫీ ప్రాజెక్ట్ అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ ఎమ్.ఎమ్. నాయక్ సూచించారు. ఈ ఏడాది పంట సేకరణలో జిసిసి లక్ష్యాలను చేరుకోవడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం పాడేరు ఐటిడిఏలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం 10,000 అదనపు కాఫీ మొక్కల నాటేందుకు కావాల్సిన సీడ్‌ను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. అలాగే, కాఫీ పంటకు నీడనిచ్చే సిల్వర్‌ఓక్ చెట్లను నర్సరీల ద్వారా తయారు చేసి 30,000 మొక్కలను రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
సమావేశానికి వర్చువల్‌గా హాజరైన జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి, పార్చిమెంట్, చెర్రీ పంటలకు మార్కెట్‌కు అనుగుణంగా ధర నిర్ణయం చేయాలని కోరారు. బెర్రీ బొరర్ తెగులును నివారించేందుకు డ్రైయర్స్ అత్యవసరమని, వాటిని రాయితీతో రైతులకు అందించేందుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆమె సూచించారు.
జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్‌కుమార్, మాట్లాడుతూ జిల్లాలో కాఫీ సేకరణ విస్తరణకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ, జిసిసి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తూ రైతు సంఘాలతో కలిసి ముందుకు సాగనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఇంచార్జి జాయింట్ కలెక్టర్ శ్రీపూజా, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, కాఫీ బోర్డు అధికారులు, ఉద్యాన శాఖ, ఐటిడిఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


