Trinethram News : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సహకారం చేసిన ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినం సందర్బంగా ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల సమక్షలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ కి శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.
అనంతరం హన్మంతన్న మాట్లాడుతు ……
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో శ్రీమతి సోనియా గాంధీ పాత్ర అపారమని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ, ప్రజల మనసును గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన మహానీయ నాయకత్వం సోనియా గారిదేనని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడూ ప్రజల కోసం పనిచేసిందని, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యల పరిష్కారానికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నామని హన్మంతన్న తెలిపారు.
నాయకులు మరియు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ బలాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లి, తెలంగాణ అభివృద్ధి పథంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సోనియా గాంధీ కి ఆయురారోగ్యాలు కలగాలని, ఇంకా ప్రజాసేవలో మరెన్నో అడుగులు ముందుకు వేయాలని కోరుతూ కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు, కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


