Mother of Telangana Idol : వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేడు జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర వైభవాన్ని చాటే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం, జిల్లా కలెక్టర్ సమక్షంలో అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు “తెలంగాణ ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకుంటామని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమవుతామని” ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జరిగిన సాంస్కృతిక వేదికపై కళాకారులు తెలంగాణ పౌరుషాన్ని, చరిత్రను గుర్తుచేసే నృత్యాలు, పాటలు ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్లు, లింగ్య నాయక్ జిల్లా స్థాయి అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mother of Telangana idol unveiled at Vikarabad Collector's office

You cannot copy content of this page

Scroll to Top