DSP Sahabad Ahmed : హెల్మెట్ వినియోగం తప్పనిసరి – డి.ఎస్.పి సహబాద్ అహ్మద్

TRINETHRAM NEWS

అరకులోయ డిసెంబర్ 9, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో పాడేరు డి.ఎస్.పి సహబాద్ అహ్మద్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. “హెల్మెట్ పెడతావా. హాస్పిటల్‌కి వస్తావా” అనే సందేశంతో సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పోలీసులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి సహబాద్ అహ్మద్ మాట్లాడుతూ, అరకు ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రం కావడంతో డిసెంబర్, జనవరి నెలల్లో పర్యాటకుల రద్దీ అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో పాటు ఉదయం సమయంలో “పొగ మంచు” కారణంగా యాక్సిడెంట్ల ప్రమాదం పెరుగుతుందని చెప్పారు. అందువల్ల స్థానికులు, పర్యాటకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే నూతన మోటార్ వెహికిల్స్ చట్టం ప్రకారం జరిమానాల వివరాలు వెల్లడించారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే “వెయ్యి రూపాయలు” జరిమానా.. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే “పదివేల రూపాయలు” జరిమానా… స్పీడు రేసింగ్ చేస్తే “పదివేల రూపాయలు” జరిమానా… లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా “పదివేల రూపాయలు” జరిమానా…

వాహనం నడిపేవారు ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, కార్లు నడిపేవారు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని డి.ఎస్.పి సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాణాలను కాపాడే కవచాలుగా భావించి నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో అరకు సీఐ హిమగిరి, అరకువ్యాలీ, ఎస్సై గోపాలరావు, మరియు అనంతగిరి, డుంబ్రిగూడ ఎస్సైలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Helmet use is mandatory

You cannot copy content of this page

Scroll to Top