అరకులోయ డిసెంబర్ 9 (త్రినేత్రం న్యూస్): పంచాయతీరాజ్ శాఖలో దాదాపు మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రమోషన్ల సమస్యను తొలగిస్తూ, డీడీవో వ్యవస్థ అమలు ద్వారా ఒకే దెబ్బకు 10 వేల మందికి ప్రమోషన్లు ఇవ్వడం ప్రస్తుత కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జానపద కళలు,సృజనాత్మకత అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ & అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య అన్నారు.
ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ “ఏ ఉద్యోగంలో చేరితే అదే పదవిలో రిటైర్ అయ్యే పరిస్థితులు పంచాయతీరాజ్ శాఖలో సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఉద్యోగుల ఆ బాధను తొలగించిన నాయకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ . 30 ఏళ్లుగా ప్రమోషన్లు లేని శాఖలో ఒకేసారి 10 వేల మందికి పదోన్నతులు ఇవ్వడం చరిత్రాత్మకం” అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన గంగులయ్య, “వైసీపీ పాలనలో ఉంటే ప్రమోషన్ల పేరుతో కనీసం రూ.100 కోట్లు వసూలు చేసేవారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు వారి చుట్టూ తిరిగేలా చేసి రేట్లు పెట్టేవారు అని మండిపడ్డారు, అదే ఉద్యోగాలను ఈరోజు కూటమి ప్రభుత్వం పారదర్శకంగా, ఏ ఒక్క రూపాయి భారం లేకుండా ఇచ్చింది” అని, డీడీవో వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా పంచాయతీరాజ్ శాఖలో వ్యవస్థాగత మార్పులకు నాంది పలికిందని గంగులయ్య స్పష్టం చేశారు.
ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి ఇదే నిజమైన సంస్కరణల దిశగా వేసిన దృఢమైన అడుగు అని అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


