Stop Labour Cess Funds : డిపిఎంఎస్ ద్వారా చెల్లిస్తున్న లేబర్ సెస్స్ నిధులు దోచుకోవడం ఆపండి

TRINETHRAM NEWS

సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు కై పోరాడుదాం. ఈనెల 12 జరిగే సదస్సుకు భవన నిర్మాణ కార్మికులు తరలిరండి….

త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 07 ఏపీ బిల్డింగ్ మరియు కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పిలుపు..
కాకినాడ, డిసెంబర్,07: కాకినాడ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, అనుబంధ సంఘం కార్మికుల సమస్యలపై నెలవారి సమావేశం కాకినాడలో స్థానిక వీర్ కమల్ థియేటర్ వద్ద టీ.అన్నవరం అధ్యక్షతన ఆదివారం ఉదయం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. అన్నవరం మాట్లాడుతూ ప్రతినెల మొదటి ఆదివారం వీర్ థియేటర్ వద్ద నిర్మాణ కార్మికుల సమావేశం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో భవన నిర్మాణ కార్మికులు సభ్యులుగా చేరాలని,నమోదు చేయించుకున్న గుర్తింపు కార్డు పొందిన ప్రతి కార్మికుడు తమ కార్డును రెన్యువల్ చేయించుకోవాలని, పథకాలు అమలు అయ్యేసరికి కార్డులు రెన్యువలు లేకపోతే పథకాలు వర్తింపవని ఆయన అన్నారు.

తోకల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ రంగం అనేది చాలా కీలకమైనదని, భవన నిర్మాణ కార్మికులు నిర్మాణాలు చేపట్టేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతుంటాయని, ఈ నీ నిర్మాణ కట్టడాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులు కొన్ని సందర్భాల్లో ప్రాణాలుకోల్పోతున్నారని, కుటుంబాన్ని పోషించే కుటుంబ యజమాని మృతి చెందడంతో కుటుంబం చిన్న భిన్నం అవుతుందని, పిల్లల చదువులు, పెళ్లిళ్లు లాంటి కార్యక్రమాలు చేయుటకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని ఆయన అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు భరోసాగా ఉండేందుకే 1996 లో భవన నిర్మాణ కార్మికులకు చట్టం ఏర్పడిందని. ఈ చట్టం 2009 నుండి అమలయిందని, భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అప్పటినుండి ప్రభుత్వాలు పథకాల మంజూరు చేయడం జరిగింది.

లేబర్ సెస్సు ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు జమ చేసే వారిని మొదట్లో లేబర్ మాన్యువల్ పద్ధతిలో లేబర్ అధికారులు లేబర్ చేసిన వసూలు చేసే వారిని, ప్రస్తుతం లేబర్ సెస్ డీపీఎంఎస్ (డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టం) ద్వారా ఇంజనీర్స్ , బిల్డర్స్ , వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ లు చెల్లింపులు చేస్తున్నారని, ఈ నిధులు ఎవరు ఖాతాలోకి వెళ్తున్నాయో తెలియడం లేదని, గత ప్రభుత్వం పార్టీ కార్యకలాపాల కొరకు పూర్తిగా ఈ నిధులు దుర్వినియోగించి దోచుకుందని, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినా లేబర్ సెస్ నిధులు దోచుకోవడం ఆపాలని, భవన నిర్మాణ కార్మికులకు పథకాలు అమలు చేయాలని ఆయన అన్నారు.

భవన నిర్మాణ కార్మికులకు కాకినాడ లో డిసెంబర్ 12న జరిగే సదస్సును జయప్రదం చేయాలని, ఈ సదస్సుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న భవన నిర్మాణ కార్మికులు తాపీ మేస్త్రీలు, ఎలక్ట్రిషన్లు, పెయింటర్లు, కార్పెంటర్లు, టైల్స్, మార్బుల్స్, గ్రానైట్స్, వెల్డర్స్, ప్లంబర్, మట్టి పని చేయువారు తదితర రంగాల కార్మికులు తరలిరావాలని, సంక్షేమ బోర్డు పథకాలు అమలుకై ఐక్యంగా పోరాడదాం అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి త్రిమూర్తులు, రమణ, నమ్మి బాలకృష్ణ, శ్రీనివాస్, యేసు,తోట శ్రీనివాస్, రామకృష్ణ, చిన్న , కృష్ణ,తదితరుల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stop looting labor cess funds paid through DPMS..

You cannot copy content of this page

Scroll to Top