వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్. యువత, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడకండి ప్రభుత్వాలతో, ఆధిపత్య కులాలతో కలిసి సంఘటితంగా పోరాడుదాం సంతాప సభలో పలువురు బీసీ నాయకులు తాండూర్, బీసీ 42% రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన బీసీ ఉద్యమ తొలి అమరుడు సాయి ఈశ్వర్ చారి కీ తాండూర్ బీసీ సంఘం ఆధ్వర్యంలో విశాల్ మార్ట్ వద్ద సాయంత్రం 6:30 గంటలకు నిర్వహించిన కాండిల్ శ్రద్ధాంజలి సభ ఘనంగా ముగిసింది.
సభలో బీసీ సంఘం నాయకులు, యువత,బీసీ బంధువులు పాల్గొని అమరుడైన సాయి ఈశ్వర్ చారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. పాల్గొన్న ప్రతి ఒక్కరూ సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, బీసీ 42% రిజర్వేషన్లను తక్షణమే చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు.యువత ఎవ్వరూ ఇలాంటి ఆత్మహత్యాత్మక చర్యలకు పాల్పడకూడదని,బీసీ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో, సంఘటితంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి మధుసూదన్ రావు బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూరు బిసి జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ విద్యావంతులు పర్యాద రామకృష్ణ బీసీ నాయకులు బసవరాజ్ మంతటి రాజు పరమేష్ జోసఫ్ లడ్డుగౌడ్ మధుసూదన్ గౌడ్ టేలర్ రమేష్ యాసర్ వెంకన్న శ్రీనివాస్ చిన్న విజయ్ మారుతి ప్రతాప్ సింగ్ తదితరులు పాల్గొని క్యాండిల్స్ తో సాయి ఈశ్వర్ చారి చిత్రపటానికి నివాళులు అర్పించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


