MLA KP Vivekanand : హరిహర సుతుడి దీవెనలతో ప్రజలంతా సంతోషంగా ఉండాలి

TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు కొంపల్లి మున్సిపాలిటీ పరిధి దూలపల్లి లోని శ్రీశ్రీశ్రీ అయ్యప్ప దేవస్థానం 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై హరిహర సుతుడు అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… హరిహర సుతుడు అయ్యప్ప దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతల దేవేందర్ యాదవ్, మాజీ సర్పంచ్ చింతల లక్ష్మీ దేవేందర్, కొంపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, మాజీ కౌన్సిలర్ డప్పు కిరణ్, నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ ఆలయ కమిటీ సభ్యులు గంగల వెంకటేష్, సభ్యులు సతీష్, రఘు, రాకేష్, ధర్మ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

May all the people be happy with the blessings of Harihara Suthudi

You cannot copy content of this page

Scroll to Top