త్రినేత్రం న్యూస్: డిసెంబర్ 2: నెల్లూరు జిల్లా: కడనూతల. బోగోలు మండలం :కడనూతల గ్రామంలో గల రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ,మంగళవారం నాడు జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంను పురస్కరించుకొని సివిల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ,డాక్టర్ .పి .వి. ఎన్. రెడ్డి ,తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఎస్.ఆర్. ఎం.బీ.ఏ. డిపార్ట్మెంట్లో సీనియర్ అద్యాపకులైన బి. శ్రీకాంత్ రెడ్డి పాల్గొని జాతీయ కాలుష్య నివారణ చర్యలు గురించి బీటెక్ విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ సందర్భంగా , మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని జరుపుతున్నారనీ, పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, వాతావరణ ముప్పులు, ఆరోగ్య ప్రమాదాలు, తరచుగా జరిగే పర్యావరణ సంఘటనలపై అవగాహన కల్పిస్తూ దీనిని నిర్వహిస్తున్నారనీ తెలిపారు. ఇంకా మాట్లాడుతూ విషపూరితమైన గాలి, కలుషిత నీరు, వ్యర్థాల సమస్యలతో పోరాడటాన్ని ఇది హైలెట్ చేస్తుంది. పర్యావరణ ప్రాముఖ్యతను చెప్తూ ప్రతి ఏటా జరుపుతున్నారు. ప్రాణాలను రక్షించడానికి, పరిశుభ్రమైన అలవాట్లతో పాటు మరెన్నో అవలంబించడానికి ఇది పిలుపునిస్తుంది. మరి దీనిని ఇండియాలో నిర్వహించడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రాముఖ్యతలు, ఇంట్రెస్టింగ్ విషయాలు గురించి ఉదాహరణలతో వీడియో రూపంలో విద్యార్థిని విద్యార్థులకు చూపించారు.
సివిల్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు మాట్లాడుతూ పర్యావరణ భద్రత, ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వం పౌరులు, పరిశ్రమలు కాలుష్య నివారణపై స్థిరమైన పద్ధతులు ప్రేరేపించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌ల ప్రోత్సహించడ తగ్గించడం, సౌర, జీవ ఇంధనం, విద్యుత్ రవాణాను ప్రోత్సహించి ప్రజా భాగస్వామ్యంను భారీ అవగాహనపై ప్రచారాలు, పాఠశాలల భాగస్వామ్యం అయ్యేలా చూసుకోవాలి కోరారు. తదనంతరం పై కార్యక్రమం మీద నిర్వహించిన ఎస్సే రైటింగ్ పోటీలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్వీ రమణారెడ్డి, ఐ క్యు ఏ.సి ,అధ్యక్షులు డాక్టర్ బి.సత్యనారాయణ రెడ్డి, సివిల్ డిపార్ట్మెంట్ అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


