Institutions as a Business : వ్యాపారంగా నేటి విద్యాసంస్థలు

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 02 త్రినేత్రం న్యూస్. ఆనాటి గురువులు చదువులు సంస్కారం నేర్పితే , నేటి చదువులు , విద్యాసంస్థలు ఒక వ్యాపారంగా మారాయి. ఆనాటి విద్యా సంస్కారం నేర్పితే, నేడు విద్యా వ్యాపారంగా మారింది.
మొత్తం మీద నాటి విద్యా సంస్కారం నేర్పితే, నేడు విద్యా ధ్యానంతో పాటు వ్యపార్కొనాన్ని జోడించి దోచుకుంటున్నారు. పేదవారికి పేదవారికి అందనంతఎత్తులో కార్పొరేట్ స్కూల్ , కాలేజ్ లు ఉన్నా యంటే చదువుకునే విధానం మారాలి , ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పించిన హంగు ఆర్భాటాలకు పోయి వేలల్లో ఫీజులు చెల్లించ లేక ఇతరమధ్య తరగతి తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.
కార్పొరేట్ స్కూల్లో అధికంగా ఫీజులు వసూలు చేసిన పాఠ్యపుస్తకాలకు అధికంగా డబ్బులు తీసుకున్న, అధికారులు మామూలు మత్తులో మునిగి చూసి చూడనట్లుగా వ్యవహారిస్తున్నా రని కొంతమంది తల్లిదండ్రుల ఆవేదన. అధికంగా ఫీజులు తీసుకునే విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరుతున్నారు.
నియోజకవర్గంలోని ప్రభుత్వ బడి పంతుల్లు కొంతమంది ప్రైవేట్ విద్యాసంస్థలు వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని తమ విధులకు సక్రమంగా నిర్వర్తించకుండా , కేవలం హాజరు కోసం పాఠశాలలకు వచ్చి ఉదయం అరగంట సాయంత్రం అరగంట వచ్చి వెళ్తుంటారని , డిండి మండల పరిధిలో పలువురు ఉపాధ్యాయులు విధులకు సక్రమంగా సమయానికి రారని అలాంటి వారిపైసంభందిత ఉన్నతాధికారులు కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు .

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today's educational institutions as a business

You cannot copy content of this page

Scroll to Top