వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లి లోని బి ఆర్ ఎస్ భవన్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఈ సందర్బంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ.తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో* అని ప్రకటించిన తరాల తెలంగాణ గోస తీర్చేందుకు గాను కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకుని తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టమే దీక్షా దివస్ అని తెలిపారు.
స్వరాష్ట్ర పోరాటాన్ని మలుపు తిప్పి, తెలంగాణ నుదుటిరాతను మార్చిన దీక్షా దివస్ రాష్ట్ర ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోయే పండుగ రోజన్నారు. ఆరోజు కేసీఆర్ చేసిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆయన పాలనలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు.
దీక్షా దివస్ సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. *తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలతో వందనం చేసి, తెలంగాణ అమర వీరుల స్థూపం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాటి ప్రత్యేక పోరాట జ్ఞాపకాలను ‘దీక్షా దివస్’ వేదికగా మరోసారి నెమరేసుకుని తెలంగాణ ఉద్యమకారులనుసన్మానించారు.ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్ రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షులు రామ్ రెడ్డి , జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ మరియు బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


