కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
Trinethram News : ఈరోజు 128 – చింతల్ డివిజన్ ఐడిపిఎల్ చౌరస్తాలోని నవజ్యోతి హై స్కూల్ నందు పూర్వ విద్యార్థుల (1985- 2015) సమ్మేళనంలో భాగంగా నిర్వహించిన ఆలుమ్ని నీట్ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో, పూర్వ విద్యార్థులు పాఠశాలల ఉపాధ్యాయులు, వారికి ఉన్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
అనంతరం బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… పాఠశాల యాజమాన్యం పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు వారి, వారి రంగాలలో గల విషయ పరిజ్ఞానాన్ని మార్పిడి ద్వారా ఇతరులతో పంచుకొని అభివృద్ధి చెందినపుడే చదువు చెప్పిన పాఠశాలకు, పుట్టిన ఊరికి మంచి పేరు గండించవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఇందిరా మలిరెడ్డి, పాఠశాల వ్యవస్థాపకులు రవీందర్ రెడ్డి బొమ్మారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ఆదిత్య కృష్ణారెడ్డి మలిరెడ్డి, ప్రిన్సిపాల్ రూపాంజలి బొమ్మ రెడ్డి, అకాడమిక్ ఇంచార్జ్ రామిరెడ్డి, శ్రేయోభిలాషి శాస్త్రి, డివిజన్ ప్రధాన కార్యదర్శి సుధాకర్, నాయకులు జల్దా లక్ష్మీనాథ్, క్రాంతి యాదవ్, కార్తీక్ గౌడ్, బంటి, బాలు నేత, ఇర్ఫాన్, అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


