Prema Kumar : న్యూరో సమస్యతో బాధపడుతు చికిత్స పొందుతున్న కార్యకర్తను పరామర్శించిన జనసేన నాయకులు

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 22 (త్రినేత్రం న్యూస్) : ఈ రోజు కూకట్‌పల్లి కేపిహెచ్బీ రోడ్ నెంబర్–4 లో ఉన్న హైదరాబాద్ న్యూరో సెంటర్ (హెచ్.ఎం.సి) హాస్పిటల్‌లో, గత కొన్ని నెలలుగా తీవ్రమైన నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్న జనసేన కార్యకర్త సూర్యనారాయణ ని పరామర్శించిన కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ప్రేమ కుమార్ . సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి, ప్రస్తుతం జరుగుతున్న చికిత్స వివరాలు, అవసరమైన మెడికల్ టెస్ట్‌లు, మందులు, మరియు రికవరీ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలియజేసుకున్నారు.

ఆయనకు కావాల్సిన అన్ని వైద్య సాయం త్వరితగతిన అందేలా ఆసుపత్రి సిబ్బందికి సూచనలు చేశారు.అలాగే కార్యకర్త కుటుంబ సభ్యులను ధైర్యపరుస్తూ, పార్టీ తరఫున ఎల్లప్పుడూ వారి పక్కనే ఉంటామని, అవసరమైన సహాయాన్ని అందించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు.తరువాత సూర్యనారాయణ తో కాసేపు మాట్లాడి, మానసికంగా ధైర్యం ఇవ్వడం జరిగింది. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని ప్రేమ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, కలిగినీడి ప్రసాద్, పోలేబోయిన శ్రీనివాస్, పులగం సుబ్బు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janasena leaders visit activist suffering from neuro problem

You cannot copy content of this page

Scroll to Top