MLA Nenavat Balu Naik : 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన

TRINETHRAM NEWS

వ్యవసాయాన్ని సుస్థిరత రంగంగా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగు
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా –ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్.

దేవరకొండ డివిజన్ నవంబర్ 21 త్రినేత్రం న్యూస్. కొండమల్లెపల్లి మండలం గాజీనగర్ తండాలో 3 కోట్లు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించబోయే 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి నేడు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ రంగం సుస్థిరంగా అభివృద్ధి చెందేందుకు స్థిరమైన విద్యుత్ సరఫరా అత్యంత కీలకం అని, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గాజీనగర్ ప్రాంతంలో ఉన్న లో వోల్టేజ్ సమస్యను పూర్తిగా నివారించి, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయడం తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు.

ఒక సంవత్సరంలో దేవరకొండ నియోజకవర్గానికి 7 సబ్ స్టేషన్లు మంజూరు చేయించామని, అందులో పోగిళ్ళ, మేడారం, గాజీనగర్ సబ్ స్టేషన్ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో డీఈ విద్యాసాగర్, ఏడి సైదులు, ఏఈ లక్కిదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమునా మాధవరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, టీపీసీసీ సభ్యులు డా. వేణుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రేఖా శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, నాయకులు యుగంధర్ రెడ్డి, మేకల శ్రీనివాసులు, యాదగిరి, కాసర్ల వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Foundation stone laid for the construction of 33/11 KV substation

You cannot copy content of this page

Scroll to Top