త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, విధుల్లో విశిష్ట సేవలు అందించిన 7 గురు పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి వికారాబాద్ జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, ఘనంగా సన్మానించారు. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, 2025 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకాలను ఎస్పీ స్వయంగా అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ కె. నారాయణ రెడ్డి మాట్లాడుతూ: “పోలీస్ శాఖలో పతకాలు సాధించడం అనేది కేవలం వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు, అది వారు చేసిన అత్యుత్తమ సేవకు, నిబద్ధతకు నిజమైన నిదర్శనం. ప్రజా రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో మన జిల్లా పోలీసులు ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు. ఈరోజు పతకాలు అందుకున్న అధికారుల పనితీరు తోటి ఉద్యోగులకు ఆదర్శప్రాయం,” అని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి జిల్లాలో మరింత మెరుగైన శాంతి భద్రతలను నెలకొల్పాలని వారు ఆకాంక్షించారు.
పతక గ్రహీతల వివరాలు:
ఈ కార్యక్రమంలో మొత్తం 7 మంది అధికారులకు ఎస్పీ పతకాలను ప్రదానం చేశారు:
- అతి-ఉత్కృష్ట సేవా పతకం
• హెచ్.సి. ఆర్. భీమ్ రెడ్డి (దోమ పోలీస్ స్టేషన్) - ఉత్కృష్ట సేవా పతకం
• పి.సి. చాకలి సురేష్ (కొడంగల్ పోలీస్ స్టేషన్)
• - సేవా పతకం
• ఎస్.ఐ. ఎ. రమేష్( సిసిఎస్ వికారాబాద్)
• ఏ.ఆర్.ఎస్.ఐ. ఎం.ఏ. రషీద్( డి ఎ ఆర్ వికారాబాద్)
• ఏ.ఆర్.ఎస్.ఐ. జి. బిచప్ప( డి ఎ ఆర్ వికారాబాద్)
• ఏ.ఎస్.ఐ. ఎ. లక్ష్మణ్ సిసిఎస్ వికారాబాద్)
• హెచ్.సి. టి. రాజు (పి సి ఆర్ వికారాబాద్)
పతకాలు అందుకున్న అధికారులకు మరియు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


