SP K. Narayana Reddy : ప్రజలకు పోలీస్ అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ జిల్లా పోలీస్ ఉన్నతాధికారి కె. నారాయణ రెడ్డి, ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని సబ్-డివిజన్ల పోలీస్ అధికారులు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

సమావేశం ప్రారంభంలో, ఎస్పీ జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, అలాగే వివిధ పోలీస్ స్టేషన్‌లలో పెండింగ్‌లో ఉన్న కేసుల స్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కేసుల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని, త్వరితగతిన పూర్తి చేయాల్సిన కేసులను వెంటనే ముగించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, సామాన్యులకు న్యాయం అందించడంలో ఆలస్యం జరగకూడదని, ప్రతి ఫిర్యాదుపై చట్టపరమైన విచారణ వేగంగా పూర్తి కావాలని ఎస్పీ తెలిపినారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో తమ తమ పోలీస్ స్టేషన్ల పరిధిలలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందుగానే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంతేకాక, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా హైవేలపై మరియు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఎస్పీ గారు తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల విషయంలో సున్నితంగా వ్యవహరించి, దర్యాప్తును వేగవంతం చేయాలని, వారికి తక్షణ న్యాయం అందేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు అందరూ ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉండేలా, పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా, ప్రతి కేసు దర్యాప్తులో శిక్షా శాతం (కన్విక్షన్ రేటు) పెరిగే విధంగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలు (సైబర్ నేరాలు) నేరాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ కె. నారాయణ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.

ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ , వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్య డిసిఆర్బి డీఎస్పీ జానయ్య జిల్లాలోని ఇన్స్పెక్టర్ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఆర్ ఐ లు, ఎస్.ఐ లు సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Police officers should always be available to the public

You cannot copy content of this page

Scroll to Top