Trinethram News : హైదరాబాద్:నవంబర్ 21 : ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ముఖ్యంగా స్టార్ బాక్సర్,తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ మరోసారి తన శైలి ఏంటో చూపించింది.మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్ గెలిచిన తీరు చూసిన అభిమానులు గర్వంగా ఉప్పొంగిపోయారు.ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన గవో యీ గ్జువాన్పై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
తొలి రౌండ్ నుంచి నిఖత్ దూకుడే కనిపించింది.ప్రత్యర్థి ప్రయత్నాలను ఒక్కోసారి పంచ్‌లతో అదరగొడుతూ, నైపుణ్యాన్ని సమపాళ్లలో ప్రదర్శించింది.ముగింపు వరకు అదే ఆత్మవిశ్వాసం కొనసాగించడంతో విజయం నిఖత్ ఖాతాలో పడింది. ఇటీవల ప్రపంచ ఛాంపి యన్‌షిప్‌లో క్వార్టర్స్‌లో పరాజయం పొందిన నిఖత్‌కు ఈ విజయం ఎంతో కీలకం. ఆ ఓటమిని పక్కనబెట్టి,కొత్త జోష్‌తో తిరిగి గాడిలో పడినట్లు ఈ స్వర్ణం చెబుతోంది.
నిఖత్‌తో పాటు మరికొంత మంది భారత బాక్సర్లు కూడా తమ తమ విభాగాల్లో స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నారు.57 కేజీల విభాగంలో జైస్మిన్ లాంబోరియా అద్భుత ప్రదర్శనతో చైనీస్ తైపీ స్టార్,పారిస్ కాంస్య పతక విజేత వుయీను తేలిగ్గా ఓడించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


