Sanitation Workers : పారిశుధ్య కార్మికుల సేవలకు మనగౌరవం ఎక్కడ

TRINETHRAM NEWS

అనంతగిరి, నవంబర్ 20 (త్రినేత్రం న్యూస్): “పారిశుధ్య కార్మికుల పని ఇంకెవరూ చేయలేని అత్యంత కీలకమైన పని” అని జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు చిట్టం మురళి పేర్కొన్నారు. పంచాయితీ పరిధిలో పారిశుధ్య కార్మికుల పనితీరుపై ప్రభుత్వం తరచూ ఐవీఆర్ కాల్స్, తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు.
అయితే, ఈ తనిఖీలు జరుగుతున్నప్పుడు స్థానిక ప్రజలు పారిశుధ్య కార్మికులను కేవలం రోడ్లపై చెత్త తీసే కార్మికులుగా మాత్రమే చూసే ప్రవృత్తి మారాల్సిన అవసరం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పారిశుధ్యం ఒక ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముక. ఒక్కరోజు చెత్త నిర్వహణ ఆగిపోయినా గ్రామాలు పట్టణాలు ఎలా మారిపోతాయో అందరికీ తెలుసని అన్నారు. కేవలం 6,000 రూపాయల జీతంతో, దుర్గంధం,ధూళి,చెత్త మధ్య పనిచేస్తూ ప్రజా ఆరోగ్యం కోసం అహర్నిశలు సేవచేస్తున్న ఈ కార్మికుల కష్టం గుర్తించడంలో సమాజం వెనుకబడిందని చిట్టం మురళి వ్యాఖ్యానించారు.
“మనమే రోడ్డుపై పారేసిన సీసాలు, కవర్లు, పేపర్ ప్లేట్లు… ఇవన్నీ రోజూ శుభ్రం చేసే వారి గురించి ఒక ప్రోత్సాహక మాట చెప్పడంలో కూడా మనం వెనుకంజ వేయడం దురదృష్టకరం,” అని ఆయన అన్నారు.
మురికి నిండిన దేహంతో చలి, ఎండ, గాలి, వర్షం లేకుండా విధి నిర్వహణలో నిబద్ధతతో ఉన్న పారిశుధ్య కార్మికులను ప్రోత్సహించడం ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అని చిట్టం మురళి పిలుపునిచ్చారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Where is our respect for the services of sanitation workers?

You cannot copy content of this page

Scroll to Top