Eluru News : దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలి

TRINETHRAM NEWS

తేదీ : 18/11/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలో గల గన్నవరం నియోజకవర్గం, మండలం, గ్రామ గ్రంధాలయ సంస్థ యందు మాజీ విభిన్న ప్రతిభావంతులు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ జి. కోటేశ్వరావు ని దివ్యాంగుల సంఘనాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ చైర్మన్ ను కలిసి రెండు వేల ఇరవై ఆరు వ సంవత్సరం మార్చిలో దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ప్రభుత్వం చర్యల తీసుకుట్టన్న వైద్య ఆరోగ్యశాఖ జ్యుడీషియల్ శాఖ మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్వాహణలో జరుగుతున్నటువంటి అన్ని శాఖలు , కార్యాలయంలో దివ్యాంగులు ఉద్యోగాలను ఒకసారి వెరిఫికేషన్ చేసి వాళ్లకు రావలసిన శాతాన్ని కేటాయించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగాలు భర్తీకి ఏర్పాటు చేయవలసిందిగా ఆయనను కొరారు. అలాగే మండల కేంద్రాల్లో దివ్యాంగులకి శిక్షణ తరగతులు, ఏర్పాటు,దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు నియమిచటానికి ప్రభుత్వం చర్యలను వైద్య ఆరోగ్యశాఖ జ్యుడీషియల్ శాఖ మాత్రమే కాకుండా ,
అన్ని శాఖలు కార్యాలయల యందు దివ్యాంగులు ఉద్యోగాలను ఒకసారి వెరిఫికేషన్ చేసి వాళ్లకు రావలసిన శాతాన్ని కేటాయించి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగాలు భర్తీకి ఏర్పాటు చేయవలసిందిగా చైర్మన్ ను సంప్రదించడం జరిగింది. అదేవిధంగా మండల కేంద్రాల్లో దివ్యాంగులకి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని తెలిపారు. వికలాంగుల అవసరాలకు అనుగుణమైనటువంటి విధానంగా ఇళ్ల నిర్మాణం చేసి వాళ్లకు కేటాయింపు చేయవలసిందిగా పేర్కొన్నారు. వికలాంగులకు కావలసిన కనీస అవసరాలు అయినా ఉపకరణాలను కూడా అందించమని తెలియజేయడమైనది. అటన్నిటికీ మాజీ చైర్మన్ స్పందించి ముఖ్యమంత్రి,ప్రభుత్వం దృష్టికి అట్లాగే ప్రభుత్వ చీప్ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు దృష్టికి తీసుకెళ్తానని సూచించారు.ఈ కార్యక్రమం లో వికలాంగుల సంఘం నాయకులు బూదాటి . శ్రీనివాసరావు, చెమట. వెంకటేశ్వరరావు, పచ్చిగళ్ల.భాస్కరరావు, రావురి వెంకటేశ్వరావు, ఉప్పాల సాంబశివరావు, చల్లా కరుణాకర్ గారు, కలపాల రాజశేఖర్, అంకాలు, అనిల్, దివ్యంగుల,ప్రతిభావంతులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

The problems of the disabled should be solved.

You cannot copy content of this page

Scroll to Top