ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలునాయక్ .
దేవరకొండ డివిజన్ నవంబర్ 17 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన వారాహి హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా జరిగింది. హోటల్ యజమానులు మాల్గిరి రెడ్డి యాదగిరి రెడ్డి ఆహ్వానం మేరకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ప్రత్యేక అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ — పట్టణ అభివృద్ధిలో, ప్రజలకు నాణ్యమైన ఆహార సేవలు అందించడంలో ఇలాంటి హోటళ్లు కీలక పాత్ర పోషిస్తాయని, యువతలో వ్యాపార సృష్టి మరియు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడం సమాజ ప్రగతికి సానుకూల సూచిక అని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే దిశగా హోటల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం అని అభినందించారు.
హోటల్ యజమానులు మాల్గిరి రెడ్డి యాదగిరి రెడ్డి ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, మల్లేపల్లి ప్రాంతీయ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


