వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జడ్పీహెచ్ఎస్ శివరెడ్డి పేట్ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ప్రధాన అతిథిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్ హాజరై, పిల్లల హక్కులు, బాల్య వివాహ నిషేధ చట్టం, పి ఓ సి ఎస్ ఓ చట్టం, మహిళా భద్రతా చట్టాలు, న్యాయ సేవల సదుపాయాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ టీ వెంకటేశ్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీ పి రాము పాల్గొన్నారు.పాఠశాల నుండి జి ఎచ్ మ్ నజిమొద్దిన్ , ఉపాధ్యాయులు మ్ హెచ్. జబీర్, శివకుమార్, రఘురామ్, ప్రణీత, జబీర్ బీగం, భోపాల్ హాజరయ్యారు. కార్యక్రమం లో భాగంగా మొబైల్ వ్యసనం మొబైల్ అడిక్షన్ పై ఎస్సయ్ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించబడింది. ఇందులో పాల్గొన్న విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు అందజేసి అభినందించారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని మొబైల్ దుర్వినియోగం, సైబర్ ప్రమాదాలు, ఆన్‌లైన్ గేమింగ్ రిస్క్‌లపై అవగాహన పొందారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


