Trinethram News : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన సొంత జన సూరజ్ పార్టీతో బిహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా విఫలమయ్యారు. గతంలో అనేక పార్టీలకు విజయం అందించిన పీకే, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకపోగా, కనీసం ఆధిక్యం కూడా కనబరచలేకపోయారు.
1)ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన సూరజ్ పార్టీ బిహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసింది.
2)పార్టీ ఏ ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది, కనీసం ఆధిక్యాన్ని కూడా కనబరచలేకపోయింది.
3)గత రెండు దశాబ్దాలుగా పీకే అనేక పార్టీలకు విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.
4)తన సొంత పార్టీ విషయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు విఫలమయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు విఫలం
అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చింది అనే సామెత మాదిరి తయారైంది జన సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎలక్షన్ స్ట్రాటజిస్టుగా పని చేసి, వారు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేలా ప్రణాళికలు రచించారు ప్రశాంత్ కిషోర్. ఇక తాను స్వయంగా రాజకీయాల్లోకి దిగి జన సూరజ్ పార్టీ స్థాపించి బిహార్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీకి దిగారు. అయితే అనూహ్యంగా ఈ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవకపోగా కనీసం ఆధిక్యాన్ని కూడా కనబరచలేకపోతోంది. మొత్తం 243 స్థానాల్లో ప్రశాంత్ కిషోర్ సహా.. ఏ ఒక్క చోట కూడా జన సూరజ్ పార్టీ ఓట్లు సాధించ లేకపోయింది. అందరికీ స్ట్రాటజీలు ప్లే చేసే పీకే తన విషయం వచ్చేసరికి చతికిల పడిపోయాడు పాపం అంటున్నారు రాజకీయ విమర్శకులు.
రాజకీయాల్లో పీకే పరిస్థితి బిహార్ ఓట్ల లెక్కింపులో లీడ్‌లో ఎమ్ఐఎమ్ అభ్యర్థులు
అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం నిరాశపరిచింది. జన సూరజ్ పార్టీకి కనీసం ఒక్క ఆధిక్యం కూడా లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


