NHM : ఆఫీస్ సూపరిండెండెంట్ అనిల్ కుమార్ కు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు సమ్మె నోటీస్

TRINETHRAM NEWS

ప్రతి నెల 1 వ తేదీన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలని రామ రాజేష్ ఖన్నా డిమాండ్

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.

ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ రెండు నెలల పెండింగ్ వేతనాలు అనగా సెప్టెంబర్ మరియు అక్టోబర్ జీతాలు వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేస్తూ డి ఎం అండ్ హెచ్ కార్యాలయంలో ఆఫీస్ సూపరిండెండెంట్ అనిల్ కుమార్ కు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని , గత సెప్టెంబర్, అక్టోబర్-2025 (2 నెలల) జీతాలు అందకపోవటంతో ఉద్యోగులు పరిస్థితి దయానీయంగా మారిందని ఇంటి కిరాయిలు, పిల్లల ఫీజులు,

కుటుంబ పోషణ కష్టంగా మారిందని ప్రభుత్వ వెంటనే వేతనాలు విడుదల చేయాలని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా 1 న వేతనాలు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ ప్రభుత్వం అందజేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మహిళ ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు 180 రోజులు మంజూరు చేయాలని, నూతన జీవోలో ప్రకారం 1195, 1187 ఉద్యోగులకు పెరిగిన వేతనాన్ని వచ్చే నెల నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు , లేదంటే ఈ నెల 17న హైదరాబాద్లోని కోటి కమిషనర్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆచంట అభిషేక్, వరంగల్ జిల్లా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఎం.శ్రీనివాస్ బాబు మరియు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

NHM employees issue strike notice

You cannot copy content of this page

Scroll to Top