Take Action against Belt Shops : బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల పై చర్యలు తీసుకోండి

TRINETHRAM NEWS

ఎక్సైజ్ సీఐ కి వినతి పత్రం ఇచ్చిన బిఆర్ ఎస్ యువజన నాయకులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బెల్ట్ షాపులను తొలగించి, వైన్ షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్ లను రద్దుచేయుట గురించి విన్నపము..

గోదావరిఖని ఎక్సైజ్ స్టేషన్ పరిధి లో నూతన వైన్ షాపులు ఏర్పాటు చేయడానికి టెండర్లు ఖరారు అయ్యాయి. డిసెంబర్ 1వ తేది నుంచి నూతన షాపులు ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా ప్రస్తుతం వైన్ షాపులతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను భవిష్యత్లో ఎదురుకాకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకోవాలని గురువారం బి ఆర్ ఎస్ యువజన సంఘం అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ ఎక్సైజ్ అధికారులను కోరారు. ఎక్సైజ్ చట్టం 2012 రూల్ నెం.24, 25 ప్రకారం ప్రస్తుతం వైన్ షాపులకు అనుబంధం ఉన్న పర్మిట్ రూమ్ లను కొనసాగిస్తున్నారు. కానీ ఇవేవి నిబంధనల ప్రకారం కొనసాగడం లేదు. ఆహార పదార్థాలు విక్రయించకూడదని నిబంధన ఉన్నా అన్నీ పర్మిట్ రూమ్లలో కిచెన్ నిర్వహిస్తున్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ గోదావరిఖని సర్కిల్ పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల్లో విచ్చల విడిగా బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఎప్పుడు మద్యం కావాలన్నా మందు బాబులకు లభించే సౌకర్యవంతమైన వస్తువుగా మారిపోయింది. దీంతో పట్టణాల్లో, గ్రామాల్లో యువత అర్ధరాత్రి, తెల్లవారుజాము వరకు బెల్ట్ షాపుల్లో మద్యం కొనుగోలు చేస్తూ తాగుతూ రోడ్లపై చిందులు వేస్తున్నారు. దారిన వెళ్లే వారిపై అకారణంగా దాడులకు పాల్పడుతున్నారు. రోడ్లపై మద్యం సీసాలు పగుల గొడుతూ ప్రజాశాంతికి భంగం కలిగిస్తున్నారు. యువత భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. ఇదంతా కేవలం బెల్ట్ షాపుల నిర్వహణతోనే కొనసాగుతున్నది. బెల్ట్ షాపుల కట్టడితో ఇలాంటి అరాచకాలు 90శాతం వరకు తగ్గే అవకాశం ఉన్నది ప్రస్తుత ఎక్సైజ్ కాలంలో కొనసాగుతూ ప్రజా జీవనానికి ఇబ్బందిగా మారిన వైన్స్ కు అనుబంధంగా పర్మిట్ రూమ్లను నూతన షాపులలో రద్దు చేసి, బెల్ట్ షాపులను మూసివేసి యువత భవిష్యత్తు ను కాపాడగలరని బి ఆర్ ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో కోరుతున్నానము.
ఈ కార్యక్రమంలో మడిశెట్టి రవి,ఎండి, అతారుద్దీన్, బోట్ల పోషం,ఉదయ్, శ్రీనివాస్, యువరాజ్, గిరీష్, సచిన్, శివ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Take action against belt shops

You cannot copy content of this page

Scroll to Top