వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక రాష్ట్రం, గుల్బర్గా జిల్లా, షెడం తాలూకా, బానూర్ గ్రామానికి చెందిన నాగమణి కి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడు లక్షలు ప్రకటించడం జరిగింది. ఈరోజు చేవెళ్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగమణి కుటుంబ సభ్యులకు చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య” చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఈ నెల 3వ తేదీన జరిగిన మీర్జాగూడ బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరమని, చనిపోయిన మనిషిని తీసుకురాలేము, ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి అండగా వుండాలని రాష్ట్ర ప్రభుత్వం ఏడు లక్షల రూపాయల నష్టపరిహారం అందించిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


