Zonal Level Sports : 2వ రోజు అట్టహాసంగా జోనల్ స్థాయి క్రీడా పోటీలు క్రీడలతో ఆత్మవిశ్వాసం

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 11వ జోనల్ స్థాయి2025-2026 బాలుర క్రీడాలు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల శివారెడ్డిపేట వేదికగా గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వికారాబాద్ జిల్లా డిస్టిక్ కో ఆర్డినేటర్ సాయి లత వివిధ గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్స్ తో కలిసి క్రీడాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు క్రమశిక్షణ అలవరుతుందని, ఓర్పుతో జట్టుగా పనిచేయడం అలవాటవుతుందని, తద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని సాయిలత అన్నారు. క్రీడా పోటీలను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు.

ఈ క్రీడోత్సవంలో కొత్తగాడి, మోమిన్పేట్, బంటారం, ఇబ్రహీంపట్నం మొదలగు వివిధ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జోనల్ స్థాయి క్రీడా పోటీలో వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలోని 10 విద్యాసంస్థల నుంచి 800 మందికి పైగా విద్యార్థులు వివిధ క్రీడా భాగాలలో పోటీ పడుతున్నట్లు ఆమె తెలిపారు. విద్యార్థులకు అట్లాంటిక్స్ తో పాటు , కబడి, ఖో ఖో, హ్యాండ్ బాల్, వాలీబాల్, టెన్నికాయిట్ తో పాటు చెస్, క్యారమ్స్ పోటీలను నిర్వహించనున్నారు శుక్రవారం నిర్వహించిన క్రీడా పోటీలకు శివ రెడ్డిపేట్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కొత్తగాడి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఇబ్రహీంపట్నం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, కోకట్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, మోమిన్పేట్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పోటీలలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి కరచలనం చేసి విద్యార్థులను ప్రోత్సహించారు.

శుక్రవారం మధ్యాహ్నం నాటికి బాస్కెట్బాల్ పోటీలలో ఇబ్రహీంపట్నం గురుకుల పాఠశాల విద్యార్థులు మొదటి స్థానంలో నిలువగా, బ్యాట్మెంటన్ క్రీడా పోటీల్లో శివరెడ్డిపేట్ గురుకుల పాఠశాల విద్యార్థులుమొదటి స్థానంలో నిలిచాయి. మిగతా గురుకుల పాఠశాలల విద్యార్థులు శనివారం ముగింపు కార్యక్రమానికి వివిధ రకాల పోటీలకు హోరా హోరీగా తల పడుతున్నట్లు డిస్టిక్ కో ఆర్డినేటర్ సాయి లత తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్ వ్యాయమ ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

2nd day of Attahasanga Zonal level sports competitions,

You cannot copy content of this page

Scroll to Top