Bus Accident : మహారాష్ట్రలోని అమరావతిలో ఘోర బస్సు ప్రమాదం:నలుగురు మృతి

TRINETHRAM NEWS

Bad bus accident in Amaravati, Maharashtra: Four dead

మహారాష్ట్ర : సెప్టెంబర్ 23
మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది,అమరావతి జిల్లాలోని పరాట్వాడ ధరణి రహదారి పై ఈరోజు సాయంత్రం సేమడోఫ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. పలువురు గాయపడ్డారు. సేమడోహ్ సమీపంలోని భూత్‌ఖోరా ప్రాంతంలో ప్రమాదకరమైన వంపు దగ్గర డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు.

ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికలు ఉన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూటీం ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top